సారుప్యత అంటే ఇదేనేమో ... వారసత్వ రాజకీయాలకు పేరుగాంచిన కాంగ్రెస్ లో సారూప్య రాజకీయాలకు తెరలేచింది. అప్పట్లో రాజీవ్ గాంధీ మరణానంతరం పి.వి. నరసింహారావు ప్రధానమంత్రి అయ్యారు. ఆయన గాంధీ - నెహ్రూ కుటుంబ వారసుడు కాదు, వారి విధేయుడు మాత్రమే. రాజీవ్ హత్య దురదృష్టకరమే అయినప్పటికీ... ఆ సంఘటన పి.వి. నరసింహారావు లాంటి మేధావిని, మన్మోహన్ సింగ్ లాంటి గొప్ప ఆర్దికవేత్తను ఈ దేశానికీ అందించింది. పి.వి హయాం లోనే ప్రపంచ బ్యాంకు వద్ద తాకట్టు పెట్టిన 200 టన్నుల బంగారాన్ని విడిపించడం జరిగింది. అప్పట్లో పార్టీ, ప్రధాని పగ్గాలను చేపట్టాలని సోనియా గాంధీని కోటరీ ( గాంధీ - నెహ్రూ కుటుంబ విధేయులు) ఒత్తిడి చేసినప్పటికి ఆమె ఎందుకో తిరస్కరించారు.
అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి మరణానాతరం అనుభవశాలి, సమర్ధుడు, పొదుపరి, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఎరిగిన రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారు. కానీ... జగన్ సి.ఎం కావాలని ఆయన మద్దతుదారులు, అభిమానులు కోరుతున్నా... జగన్ తిరస్కరించకపోవడం గమనార్హం. ఉద్యోగసంఘాల డిమాండ్లకి తల ఒగ్గడం, అవసరం లేకపోయినా జనాకర్షక పధకాలను ప్రవేశపెట్టడంతో రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ఖజానా పై భారం పెంచేసారు. ప్రస్తుతం రోశయ్య ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గాడిలో పడుతున్దనడానికి శకునం.
analysis ki telugu word pettochu kada guru
ReplyDelete