Saturday, June 12, 2010

మీ మొగుళ్ళు తాగాల్సిందే ... తాగి చావాల్సిందే


1 comment:

 1. 'రాష్ట్రంలో ఇంతమంది పేదలు ఉన్నారా? అని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ సందేహిస్తుంటే,'రాష్ట్ర ప్రజల ఆదాయం పెరిగింది,అందుకే మద్యం దుకాణాలకు గిరాకీ అంత భారీగా పెరిగింది అని రాష్ట్ర మంత్రులు అంటున్నారు.
  "చంద్రబాబు ప్రభుత్వం బెల్టు షాపుల ద్వారా పేద ప్రజల రక్త మాంసాలను పీల్చుతోంది"
  "పేదల నోరు పగలదీసి మరీ మద్యం పోస్తున్నారు".----2004 లో రోశయ్య.
  "మంచి నీళ్లు దొరకని ప్రాంతంలో కూడా మద్యం దొరికేలా చేశారు.మద్యం విక్రయాలు విచ్చల విడిగా పెరిగిపోయాయి"- 2010 చంద్రబాబు నాయుడు.
  మద్యం విచ్చలవిడి వినియోగం వల్ల మానవ వనరులు నిర్వీర్యమై ప్రజలు తాగుడుకు బానిసలై సోమరిపోతుల్లా మారిపోతారు.మద్యం మత్తులో నేరస్తులుగా మారతారు.గుజరాత్ లో మద్య నిషే ధం అమలులో ఉన్నా, పారిశ్రామికీకరణ ద్వారా ఆదాయానికి లోటు లేకుండా చూసుకున్నారు.ఇతర రంగాలలో దుబారాను నివారించాలి.మద్యం పనిచేసే స్వభావానికి కష్టపడే మనస్తత్వానికి దూరంగా ప్రజలను నెట్టి వేస్తుంది.తాగుడుతోనే కాలక్షేపం చేస్తారు.భార్యలను పీడించి, వారి సంపాదనను కూడా తమ తాగుడుకే పురుషులు ఖర్చు చేస్తారు. ఫలితంగా సంసారాల్లో చిచ్చురేగి ఒకరినొకరు చంపుకొనే పరిస్థితికి దారి తీస్తుంది.రోడ్డు ప్రమాదాల్లో వేల సంఖ్యలో జనం మరణిస్తున్నారు.ఎక్కడ పడితే అక్కడ మద్యం లభించడం వల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది.ఎన్నో కుటుంబాలకు దిక్కు లేకుండాపోతున్నది.సమాజ హితం దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతమైన పౌర సమాజ నిర్మాణం కోసం మద్యాన్ని నిషేధించాలి.

  ReplyDelete