భీష్ముడు, అటల్ బీహారి వాజపాయ్, అబ్దుల్ కలామ్, మాయావతి, జయలలిత, మమత బెనర్జీ, ఉమాభారతి, నరేంద్ర మోడి, నవీన్ పట్నాయక్, రాహుల్ గాంధీ ..... పరిచయం అవసరంలేని వ్యక్తులు, వీళ్ళందరికీ కొన్ని పోలికలున్నాయి. వీళ్ళంతా భారత రాజకీయాలలో చాలా ఉన్నత స్థాయి వ్యక్తులు.... అంతే కాదండి వీల్లెవారు పెళ్లి చేసుకోలేదు - బ్రహ్మచారులు.
భీష్ముడు: పురాణ కాలానికి చెందిన భీష్ముడు బహూశా భారత రాజకీయాలలో మొట్ట మొదటి బాచిలర్ కావచ్చు. ప్రతిజ్ఞా బద్దుడై చివరికంటూ బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు.
అటల్ బిహారీ వాజపాయి : ప్రస్తుత కాలానికి చెందిన వాజపాయీ పెళ్లి చేసుకోలేదు . ఈయనకు ఇద్దరు దత్త పుత్రికలు. ఈయన భారతదేశ మొదటి బ్రహ్మచారి ప్రధానమంత్రి.
జయలలిత:ఎం.జి.ఆర్ మరణం తర్వాత రాజకీయాల్లోకొచ్చిన జయ పెళ్లి చేసుకోలేదు. సహ నటులు ఎం.జి.ఆర్,శోభన్ బాబు లతో సంబంధాలున్నట్లు పత్రికలలో వార్తలు వచ్చేవి.జయ జీవితం ఆది నుండీ వివాదాస్పదమే."నేను ఈమెను కుమారి అని పిలవాలా? లేక శ్రీమతి అని పిలవాలా?" - అని కరుణానిది జనాన్నిఅడుగుతున్నారు.
మమత బెనర్జీ : ఈమె రాజకీయ జీవితమంతా పోరాటాలమయం. ఈమె కూడా పెళ్ళికి దూరంగానే ఉన్నారు.కమ్యునిస్టులపై ఒంటి కాలిపై లేస్తుంటారు.
ఘజియాబాద్(యు.పి) లో పుట్టిన ఈ బెహన్(సోదరి) కూడా పెళ్లి చేసుకోలేదు.భారత మొదటి దళిత ప్రధాని నేనే అవుతానని ప్రకటించారు.
నవీన్ పట్నాయక్ : ఒరిస్సా ముఖ్యమంత్రి. ఈయన జీవితంలో అధిక భాగం విదేశాల్లోనే గడిచిపోయింది. తండ్రి బిజు పట్నాయక్ మరణాంతరం ఒరిస్సా లో అడుగుపెట్టారు. ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు.
రాహుల్ గాంధీ : ఇంకా పెళ్లి కాలేదు. వయస్సు 39 సం. ఇండియాలో 'మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్'. అదృష్టవంతులు ఎవరైనా(అమ్మాయిలు) తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.'బెస్ట్ ఆఫ్ లక్'.
ఈ-మెయిల్: msrinivasu275@gmail.com
ఈ-మెయిల్: msrinivasu275@gmail.com
sonia gandhi ki against gaa sushma swaraj annadi. uma bhaarati kaadu
ReplyDelete