Wednesday, October 28, 2009

సోనియా ప్రధాని పదవి చేపట్టకపోవడం త్యాగమా? లేక వ్యూహమా ?



2004 సార్వత్రిక ఎన్నికలలో U.P.A  విజయం సాధించింది. సహజంగానే అందరూ సోనియా గాంధీ ప్రధాని పదవి చేపడతారని భావించారు.కానీ అప్పుడే మొదలయ్యింది రాజకీయ అంతర్నాటకం. రాజకీయులు రెండు వర్గాలుగా చీలి పోయారు. మొదటి వర్గం(కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు)  సోనియా ప్రధాని పదవి చేపట్టాలనీ .... రెండో వర్గం ( బి.జె.పి  తదితర పార్టీలు ) ఆమె ఆ పదవిని చేపడితే గొడవలైపోతాయని. చివరికి తర్జన భర్జనలనంతరం ఆమె ఆ పదవిని చేపట్టడానికి నిరాకరించారు. మొదటి వర్గం ఆమెను త్యాగశీలిగా అభివర్నించేసి అమాంతం ఆకాసానికేత్తేయగా .... రెండో వర్గం హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. 2009 లో కూడా మొదటి వర్గం అదే సీను రిపీట్ చేసింది .... కాకపోతే మోతాదు చాలా తక్కువ. ఇంతకూ మేడం ఆ పదవి స్వీకరించకపోడానికి కారణం ఏమిటి? .... కారణం వెరీ సింపుల్ .... వ్యూహం. అవును భారత రాజకీయాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ఆమాత్రం వ్యూహం అవసరమే ( కాంగ్రెస్ వాదులు దీనిని వ్యూహం అంటే ఒప్పుకోరు .... దానిని త్యగామనాలంటారు .... మనకేంటి దురద ). లేకపోతే ప్రధాని పదవి నిరాకరించే తింగరి వాళ్ళు ఈ రోజుల్లో ఎవరున్నారు. మీరు .... నేను అయితే ఆ పని చేస్తామా? .... ఖచ్చితంగా చెయ్యం .... అంతకు మించిన ప్రతిఫలం వస్తే తప్ప.

వ్యూహం వెనుక కారణాలు : 

 1. తన  కుటుంబ శత్రువు ఐన LTTE ని, పెద్దపులిని అంతమొందించడం.  
         - ఆ పని పదవిలో వుండగా చేస్తే సోనియా కు చెడ్డపేరు వచ్చేది ... వ్యక్తిగత కక్షలకు పోయి ఆ పని చేసారని విమర్శలు వచ్చేవి. 
2. పార్టీ, దేశ రాజకీయాల్లో తన స్థానం పదిలపరచుకోవడం .
          - ప్రస్తుతం పార్టీ, దేశ రాజకీయాల్లో సోనియా పరిస్థితి పదిలమే కదా !?
3. తన రాజకీయ శత్రువులపై  పైచేయి  సాధించడం.
          - ఆపని తను పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుండే మొదలుపెట్టారు . ప్రస్తుతం పార్టీలో సోనియా కి ఎదురులేదు .... పార్టీలో అందరూ గాంధీ .. నెహ్రూ విదేయులే .
4. తనయుడు రాహుల్ ని భావి ప్రధాని ని చేయడానికి కావలసిన వాతావరణం సృష్టించడం.
           - ఆ పని మీదే రాహుల్ ని ఎం.పి చేయడం ...   ఆపై దేశ పర్యటన చేయించడం.     
5. మన్మోహన్ సింగ్ లాంటి మేధావి, నిజాయితీపరున్ని ప్రధాని చేసానన్న ఖ్యాతినార్జించడం.
         - గతంలో పి.వి. నరసింహరావు ని ప్రధానిని చేసి చేతులు కాల్చుకున్న సోనియా ... మళ్ళీ ఆ పని చేయకూడదని, నమ్మిన భంటు మన్మోహన్ ని ప్రధాని ని చేసారు.   
6. త్యాగశీలిగా చరిత్రలో నిలిచిపోవడం.
         - త్యాగశీలిగా సోనియా ను 'ప్రమోట్' చేయడం  కాంగ్రెస్ వాదులు ఎప్పుడో మొదలుపెట్టారు. 


                  ఒక్క దెబ్బకు ఎన్ని పిట్టలో చూసారా !? _________________________________________________

ఈ బ్లాగు యొక్క ఆహార్యం, రచనల శైలి పై అభిప్రాయాలను పంపవలసిన చిరునామా:  msrinivasu275@gmail.com


No comments:

Post a Comment

కూడలి
మాలిక: Telugu Blogs