Thursday, October 29, 2009
తెలంగాణా వచ్చుడూ లేదు ... కే.సి.ఆర్ సచ్చుడూ లేదు
గ్రేటర్ ఎన్నికలకు నగారా మోగింది .... రాజకీయనాయకులంతా కలుగుల్లో ఎలుకల్లా బైటపడి సందడి చేస్తున్నారు. పాత ఆయుధాలను పక్కన పడేసి కొత్త ఆయుధాలకోసం వెతికేవారు కొందరైతే .... పాత ఆయుధలకే పదును పెట్టేవాళ్ళు మరికొందరు ... అసలు ఆయుధమే లేని వాళ్ళు ఏదో ఒక ఆయుధం దొరక్కపోతుందా అని చిన్ని ఆశ. ఎవరు ఏం చెసినా రాజధాని నగరాన్ని చేజిక్కిన్చుకోవడానికే!. ఇందుకు ప్రధాన పార్టీలన్నీ తమ తమ వ్యూహ, ప్రతివ్యుహాలతో ఎప్పుడో సిద్దమైపోయాయి. అందుకు ఆయుధాలు కూడా సిద్దం చేసుకున్నారు. పాలక పక్షం కాంగ్రెస్ తన అధికారబలంతో ముందుకుపోతుంటే .... ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం తన పాత ఆయుధమైన 'హైటెక్ సిటీ - క్లీన్& గ్రీన్ - అభివృద్ధి' తో ముందుకుపోతుంది . ఇక టి.ఆర్.ఎస్ తన పాత ఆయుధాన్ని వదిలి కొత్త ఆయుధానికి ( హైదరాబాద్ : ఫ్రీ జోన్ అంశం ) పదును పెడుతుంది. సందట్లో .... సడేమియా అన్నట్లు ప్రజారాజ్యం పార్టీ ఏ ఆయుధమూ లేక .... అసలు ఎలా పోరాడాలో తెలీక కొట్టుమిట్టాడుతుంది. కమలనాధులైతే తమతో ఎవరైనా కలవకపోతారా - అని పొత్తు కోసం ఎదురు చూస్తూనే .... " మేము ఎవరితోనూ పొత్తు పెట్టుకోము" అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కమ్యునిస్టులు ఎలాగూ .... ఆటలో అరటిపండులే!. గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, గత పక్షం రోజులుగా కే.సి. ఆర్ చాలా సందడి చేస్తున్నారు. గ్రేటర్ సందడంతా ఆయన మొహంలోనే కనిపిస్తుంది .... అందుకు ఆయన చేయని జిమ్మిక్కులు లేవు. పాత్రికేయులను పిలిచి ముచ్చట్లు పెట్టడం,ఎదుటివారిని బండ బూతులు తిట్టడం, ఫ్రీ - జోన్ అంశం కెలకడం అన్నీ గ్రేటర్ కోసమే. ఈ సందర్భంగా " తెలంగాణ వచ్చుడో .... కే.సి.ఆర్ సచ్చుడో "- అని కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నించారు. తెలంగాణా అంశాన్ని కే.సి.ఆరే గాకుండా సమైఖ్యవాదులు కూడా రాజకీయం చేసేస్తున్నారు. ఈ విషయంలో కే.సి.ఆర్ తెలంగాణా ప్రజలను మోసం చేస్తుండగా సమైఖ్యవాదులు 'ఆంధ్రోల్లను' కాష్ చేసుకుంటున్నారు. ఈ పోరాటంలో గెలిచేది ఎవరైనా ...... ఓడేది మాత్రం ప్రజలే( తెలంగాణా, ఆంధ్రా జనం కలిపి) !.
Subscribe to:
Post Comments (Atom)
బిడ్డా... గిట్ల తెలంగాణ మీద రాస్తే ఆంధ్రోల్లు మస్తు చూస్తరు ... హిట్స్ బాగా వస్తయని పి ను కా చి ఆలోచన జెసినవ్.... మాటర్ లేదు... బొమ్మ సూపిచ్చి బిల్డప్ ఇద్దామనా... దిక్కుమాలినా ఆలోచనలు మాని ఏదైనా పని సేసు కొ... అంత ఖాలీగ ఉంటే వివరం గా వ్రాయి,... చూస్తం... ఒహొ గిందుకని వస్తలేదా అని మమ్మల్ని మేము మార్చుకుంటం.... గంతనే కాని... దేడ్ దిమాక్ లెక్కలెంది వయా.. చిన్న పోరని లెక్క..
ReplyDeleteరామకృష్ణ అన్నా నువ్వు నాణేనికి ఒకవైపునే సుస్తున్నావే! నువ్వు అపార్ధం చేసుకుంటున్నావు .... కే.సి.ఆర్ వుచ్చులో నీవు కూడా పదినట్లున్నావు ...... పొద్దుగాలే చూడు వివరణయిస్తున్న
ReplyDeleteఏం పుక్కటికి హైదరాబాద్ లో జాబ్ లు కోట్తెద్దామని చూస్తున్నారు కాస్త వివరంగా ఫ్రీజోన్ గురించి తెలుసుకో బిడ్దా... పిచ్చి పిచ్చి రాతలు మానేయ్... ఫ్రీ జోన్ కాదురా హైదరాబాద్ మాదిరా... జై తెలంగాణ
ReplyDeletehyderabad state capital kakapothe evadu vachvadura akadiki .... kalisunapudu develop cheskunnam vidipoyepudu mekendhuku ivale ?
ReplyDelete