తెలుగు బ్లాగర్లందరికీ నమస్కారం.
తెలుగులో బ్లాగింగు రోజురోజుకీ ప్రవర్ధమానమవుతుంది ... చాలా సంతోషం. రచయితలే గాకుండా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు బ్లాగింగు చేస్తున్నారు. 2005 లో మొదలైన బ్లాగింగు ప్రక్రియ ఇంటర్నెట్ వినియోగంతో ఇప్పుడు తన విశ్వరూపం చూపిస్తుంది. పూర్వం రచయితలు, ఔత్సాహికులు తమ అభిప్రాయాలను, రచనలను దినపత్రికలలోను, వారపత్రికలలోను, మాసపత్రికలలోను ప్రచురించేవారు. ఇందుకు వారు చాలా శ్రమపడేవారు. పేపర్లలో తమ పేరు, రచనలను చూసుకుని మురిసిపోయేవారు. వాటి ప్రచురణలకు పత్రికాఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగేవారు. పత్రికాధిపతులకు నచ్చితే వాటిని ప్రచురించే వారు ... లేకపోతే లేదు. బ్లాగింగు పుణ్యమాని ఆ బాధ తప్పింది. ఇప్పుడు అందరూ తమ అభిప్రాయాలను స్వేచ్చగా వెల్లడించగలుగుచున్నారు.ఇవి ఏ పత్రికాధిపతికీ నచనక్కరలేదు.రాసిన వారికీ చుసినవారికీ నచ్చితే చాలు. ఇక్కడ పత్రికాయాజమన్యాలకు వంత పాడే ఎడిటర్లు,రిపోర్టర్లు ఉండరు .... ఎవరికి వారే పత్రికా(బ్లాగు)యజమానులు. బ్లాగింగు వర్ధిల్లాలి .... బ్లాగర్లూ వర్ధిల్లాలి.
తెలుగులో బ్లాగింగు 2004 లోనే మొదలైందండి. ఆంగ్లంలో అయితే 2000 కంటే ముందునుండే ముందునుండే ఉందనుకుంటా.
ReplyDelete