Saturday, November 28, 2009

2012 యుగాంతం : డార్విన్ పరిణామ సిద్ధాంతం


  2012 : యుగాంతం సినిమా వచ్చి రెండు వారాలు  గడిచిపోయింది ... సినిమా హాళ్ళ దగ్గర జనాన్ని చూస్తుంటే అది  విజయవంతమైనట్లే  కనిపిస్తుంది . చాలా  మంది  బ్లాగర్లు  దీనిమీద  రివ్యూలు  కూడా  రాసారు .  అయితే సినిమా చూసే ప్రేక్షకులు ( అత్యధికులు ) దర్శకుడి కోణంలో( Human emotions at the end if life)  గాకుండా తమ కోణంలో ( గ్రాఫిక్స్) చూసారు. ఒకవేళ గ్రాఫిక్స్ కోసమే అయితే ఈ సినిమా చూడటం శుద్ధ దండగ ... దీనికోసం ఇదే దర్శకుడు  దాదాపు ఇదే కధాంశంతో తీసిన Day After Tomarrow ఎంతో మేలు. ఈ సినిమాలో హీరో చేసే పనికిమాలిన సాహసాలు పక్కనపెడితే - అంతర్లీనంగా డార్విన్ పరిణామ సిద్ధాంతం కనిపిస్తుంది. 
              ఇక అసలు విషయానికొస్తే ... ఈ సినిమా  కధ భారతదేశంలో మొదలయ్యి భారత సరిహద్దులలో సమాప్తం అవుతుంది. భారతదేశానికి చెందిన ఒక యువ శాస్త్రవేత్త  అతి త్వరలో భూమి అంతం కాబోతుందని తెలియజేస్తాడు. ఈ విషయం వివిధ దేశాధినేతలు , ప్రపంచ ప్రసిద్ది చెందిన వ్యాపారవేత్తలు , ప్రముఖులకు తప్ప సామాన్య ప్రజలకు తెలియదు.  ప్రపంచంలోని మనవ జాతి మనుగడ కోసం  చైనా రహస్యంగా షిప్పులను తయారుచేస్తుంది. ఈ షిప్పులు దేశాధినేతలు , ప్రపంచ ప్రసిద్ద ధనవంతులు , ప్రముఖుల కోసం ఉద్దేశింపబడినవి. వీటిలో సామాన్యులకు ప్రవేశం లేదు. యుగాంతం దగ్గర పడుతుంది ... ఇక అక్కడ నుండి మొదలవుతుంది జీవనపోరాటం ( Struggle For Existence) ... డబ్బున్న మారాజులంతా ఎలాగైనా సరే బ్రతికి బట్టకట్టాలని ఆ షిప్పుల్లో టిక్కెట్లు కొనుక్కుంటారు . ఎప్పటిలాగే అక్కడ కూడా ఎవరిస్థాయికి  తగ్గ టిక్కెట్లు వారికుంటాయి. చచ్చే ముందు కూడా మనిషి తారతమ్యాలు మరువడు అనడానికి ఇదొక ఉదాహరణ. ఇక యుగాంతం రోజు ( డిశెంబర్ 21)  రానే వస్తుంది. ప్రకృతి తన విశ్వరూపాన్ని చూపిస్తుంది ... ఈలోపు టిక్కెట్లు కొన్న వాళ్ళు  అంతా షిప్పుల దగ్గరికి చేరిపోతుంటారు. అయితే అమెరికా అధ్యక్షుడు , రోమ్ లోని  పోప్  ఇద్దరూ తమ ప్రజలను విడిచి రావడానికి అంగీకరించరు ... వారు తమ తమ ప్రజలతో కలిసి చనిపోవాలని నిశ్చయించుకుంటారు. సహజంగా అమెరికన్లు తమను తాము హీరోలుగా చిత్రించుకుంటూ ఉంటారు ... దానికి ఉదాహరనే ఈ చిత్రంలోని హీరో , అమెరికా అధ్యక్షుడి పాత్రలు. ఇదే విషయాన్నీ బిన్ లాడెన్ ఆఫ్గాన్ యుద్ధ సమయంలో అమెరికన్లను ఉద్దేశించి అంటాడు - " వాళ్ళు సినిమాల్లోనే హీరోలు ... నిజజీవితంలో కాదు" అని. ఇక్కడ అమెరికా అధ్యక్షుడు అమెరికన్లందరికీ ప్రతీక ...త్యాగమూర్తి ... అంటే అమెరికన్లు త్యాగమూర్తులు  అన్నమాట ... ఇక అమెరికన్లకూ పోప్ కు ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే . చైనా లోనున్న షిప్పులను చేరుకోవడానికి ప్రముఖులు పడే తపన నిజంగా డార్విన్  ' మనుగడ కోసం పోరాటం ( Struggle For Existence)' ను గుర్తుకుతెస్తుంది . వీళ్ళవే ప్రాణాలా  ?  మిగతావాల్లవి  ప్రాణాలు కాదా ?  అనిపిస్తుంది .. ఈ పోరాటంలో  సామాన్యులు వెనుకబడిపోతారు ... బలవంతులు ( దేశాధినేతలు , వ్యాపారవేత్తలు) Survive  అవుతారు . పనిలోపనిగా జీవ వైవిధ్యం ( Bio - Diversity ) కోసం వీళ్ళంతా తమతోపాటు షిప్పులలో వివిధ జంతువులను ( ఏనుగులు , కుక్కలు, జిరాఫీ మొదలైనవి) తీసుకువెళతారు.కానీ అనుకోకుండా కొంతమంది అతి సామాన్యులకు  షిప్పులో చోటు దొరుకుతుంది. షిప్పులోని ప్రముఖులతో పోల్చితే వీరి సంఖ్య స్వల్పమే. ఈ జీవ వైవిధ్యంలో భారతీయులకు , సామాన్యులకు చోటుండదు ... ఎందుకంటే అప్పటికే భారత దేశం నాశనమైపోతుంది ... చివరికి ఈ ఉపద్రవాన్ని కనిపెట్టిన యువ శాస్త్రవేత్త కుటుంబం కూడా . బహూశా మనుగడ కోసం  పోరాటంలో భారతీయులు , సామాన్య ప్రజానీకం వెనుకబడిపోయారు అనడానికి ఇది సంకేతం కావచ్చు !!?? ... అంటే రెండవ మానవ పరిణామ క్రమంలో ( మనకు తెలిసినంత వరకూ ఇప్పుడున్నది మొదటి మానవ పరిణామ క్రమం )  భారతీయులకు చోటు లేదన్న మాట. ఇది ' Survival Of Fittest ' ను గుర్తుకుతెస్తుంది.
     ప్రకృతి ప్రకోపానికి ప్రపంచం మొత్తం జలమయం అవుతుంది. చివరికి ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ( ప్రస్తుతం దీని ఎత్తు : 8848 మీ. ) కూడా మునిగిపోతుంది ... షిప్పుల్లోని వారంతా బ్రతుకుతారు. కొన్ని రోజులపాటు  ఆ షిప్పులలోనే వీరి  ప్రయాణం  సాగుతుంది ... ఈలోపు ప్రకృతి కొంచెం  శాంతిస్తుంది ... సముద్రాలు వెనక్కు తగ్గుతాయి ... అప్పటికి ఆఫ్రికా ఖండం లోని ఒక పర్వతం ( పేరు గుర్తు లేదు ... బహూశా Ruwenzori పర్వతం కావచ్చు. దీని ప్రస్తుత ఎత్తు :5109 మీ. ) ఎత్తైన ప్రాంతంగా ఆవిర్భవిస్తుంది. ఆ పర్వతం వీరికి ఆవాసంగా మారుతుంది. అంటే అక్కడ నుండి రెండో మానవ పరిణామ క్రమం  ( నిజానికి దీనిని పరిణామం అనకూడదు ... ఎందుకంటే ఇక్కడ మానవుడు పూర్తిగా నాశనం కాలేదు... ఇది మొదటి పరిణామ క్రమానికి కొనసాగింపు )  మొదలవుతుందన్న మాట. ఈ కొత్త జాతిలో అందరూ ఉంటారు ... భారతీయులు తప్ప. విచిత్రమేమిటంటే ... మొదటి మానవ పరిణామ క్రమం కూడా అఫ్రికాలోనే మొదలవ్వడం . ఇక రెండో పరిణామ క్రమంలో ఎంతమంది Survive అయ్యారనేది ఉహాతీతమైనది ...ఎందుకంటే అంతమంది బలవంతుల మధ్య ఈ అతి కొద్ది మంది సామాన్యులు నెగ్గుకురావడం కష్టమే.ఇది Natural Selection కి సంబంధించినది                   

4 comments:

  1. వీళ్ళ చెత్త లాజిక్ ల సినిమాలు చూడలంటే నాకు ఎక్కడో కాలుతుంది. నిజానికి ప్రపంచంలో అత్యంత స్వార్థపరులని నా నమ్మకం.

    ReplyDelete
  2. Excellent Analysis ,superb

    ReplyDelete
  3. ఆ డర్టీ అమెరికన్ల చంకలు నాక్కుంటూ మరి వాళ్ళ చెత్త లాజిక్ సినిమాలనెందుకు చూస్తున్నారు. మరిప్పుడు మొత్తం ఆంధ్ర దేశమంతా టెంగ్లిష్ సంస్కృతికి ఎందుకు మారిపోతోంది. నేను అమెరికాలో ఇంతవరకు మన టాలీవుడ్ సినిమాలు చూడ్డానికి ఇష్టపడే ఒక్కర్ని (local Americans) కూడా చూడలేదు. అమెరికన్ల ముంజేతినీళ్ళు మనంకూడ తాగుతూనే ఉన్నాం. కాబట్టీ కొద్దిగానైన విశ్వాసం ఉండాలిమరి. మనవాల్లు ఇలాంటి నాణ్యతతో మనకు నచ్చే లాజిక్కులతో ఎందుకు సినిమాలు తీయకూడదు. ఈ విమర్శ బాగుంది - కాని లోపభూయిష్ఠం. One-sided view. You should step out of the box and then present realistic and unbiased analysis which might constructively help others to bring improvements. Thanks.

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs