Friday, November 06, 2009

సోనియా కు దగ్గరయ్యేందుకే ....



పోగొట్టుకున్నచోటే  వెదకమంటారు మన పెద్దవాళ్ళు . గాలి బ్రదర్స్ ఈ సామెతను బాగా ఒంటబట్టించుకున్నారు ...అందుకే ఎడ్డియూరప్పను దించే వరకు' గాలి' కూడా పీల్చేదిలేదంటూ  భీష్మించ్చుకూచున్నారు. కర్ణాటక, ఆంధ్రాలను ఏలేద్ధామని  ' గాలిమేడలు ' కట్టుకున్న బ్రదర్స్ కు  ' పెద్ద బాసు' మరణించడంతో ' ఎదురుగాలి ' వీయడం మొదలెట్టింది. ఏంటి ... మోకాలికీ( ఆంధ్రా) , బోడిగుండుకీ ( కర్ణాటక ) లంకె పెడుతున్నాను అనుకుంటున్నారా? ... నేను పెట్టడమేన్టండి బాబూ ... గాలి బ్రదర్సే  ఆ లంకె పెట్టుకున్నారు. గాలి బ్రదర్స్ కర్ణాటకలో బి.జె.పి  వీరాభిమానులు. సహజంగానే అక్కడ బి.జె.పి ప్రభుత్వం ఏర్పడటానికి కారణమయ్యారు. వారి ధాటికి అక్కడ కాంగ్రెస్ బాగా దెబ్బతింది ... దాంతో మేడం కి బాగా కోపమొచ్చింది ... కానీ ఏం చేస్తుంది .... మధ్యలో పెద్ద బాసు అడ్డంపడ్డాడు. మేడం సమయం కోసం  కాచుకుంది. ఆ సమయం రానే వచ్చింది .... పెద్ద బాసు కాలం చేసాడు .... చిన్న బాసు తెర మీదకొచ్చాడు ... కాదు కాదు తెర మీదకు తీసుకొచ్చారు. ఇంకేముంది మేడం కి పట్టు దొరికింది. చిన్న బాసుని పిలిపించి మాట్లాడింది. ముందు  నువ్వు' కర్నాటకం' సంగతి చూడు .... ఆ తరువాత నేను నీ సంగతి ( సి.ఎం) చూస్తాను అంది. ఇంకేముంది  కర్ణాటకలో ' జగన్నాటకానికి'  తెర లేచింది ... ఈ నాటకానికి ' గాలి' తోడయ్యింది .... అగ్గి రాజుకుంది. అక్కడ కేంద్రంలో కనుచూపు మేరలో బి.జె.పి  బ్రతికి బట్టకట్టే స్థితిలో లేదు ... ఇక్కడ  ఎడ్డియూరప్ప తో విసిగిపోయిన బళ్ళారి బ్రదర్స్ అలోశించి తమ' గాలి' ని కాంగ్రెస్ వైపు మళ్ళించారు. ఈ నాటకంలో చిన్నబాసు లాభ పడినా ... కాకున్నా' గాలి'  కి ఎదురులేదు. ఎందుకంటే ఎడ్డియూరప్ప  ఖర్మ కాలి అక్కడ ప్రభుత్వం మారితే మేడం మనసు కరుగుతుంది ... ఆపై ' గాలి ' పంట పండుతుంది. ఇంకేముంది కేంద్రం, రెండు రాష్ట్ర ప్రభుత్వాల అండతో కర్ణాటక, ఆంధ్రాలను టన్నులకొద్దీ తవ్వి  ... తవ్వి  పారేయొచ్చు. ఒకవేళ ఎద్దియూరప్ప ఖర్మ యదావిధిగా ఉంటే మరీ మంచిది ... పాత బాసే కదా మొహమాటం ఏముంటుంది ... మళ్ళీ టన్నుల కొద్దీ తవ్వుకోవచ్చు. వస్తే కొండ ... పోతే వెంట్రుక.అంతటితో'గాలి' అదృష్టం కంచికి .... మన దురదృష్టం ఇంటికి.     

No comments:

Post a Comment

కూడలి
మాలిక: Telugu Blogs