Saturday, May 14, 2011

నా అఖండ విజయానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కారణమైన మీ అందరికీ కృతజ్ఞతలు ... ఎనీ డౌట్స్


7 comments:

  1. జగన్ సంపాదించిన అక్రమ ఆస్తులకి ఆధారాలు ఉన్నాయి. ప్రభుత్వం బ్రాహ్మణి స్టీల్స్ కంపెనీకి ఇచ్చిన భూమిని ప్రభుత్వ అనుమతి లేకుండా తనఖా పెట్టి యాక్సిస్ బ్యాంక్ నుంచి ఆ కంపెనీ 350 కోట్లు లోన్ తీసుకుందని ఆధారాలు ఉన్నా బయట పెట్టలేదు. పత్రికలలో వార్తలు వస్తాయని పోలీస్ స్టేషన్‌లో ఎఫ్.ఐ.ఆర్ వ్రాయించారు కానీ ఆధారాలు కావాలని సేకరించలేదు. బ్యాంక్ మేనేజర్‌ని పట్టుకుంటే ఆధారాలు దొరుకుతాయని వాళ్ళకి తెలియదా? ఆ ఆస్తులకి ఎంకంబ్రెన్స్ సర్టిఫికేట్ ఇచ్చిన రిజిస్ట్రార్ ఆఫీస్ వాళ్ళని పట్టుకున్నా ఆధారాలు దొరుకుతాయి.

    ReplyDelete
  2. Sharma gaaru meeru velli aa dorikevi pattukondi

    ReplyDelete
  3. అనాలసిస్ గారు, అక్కడ పోటీ అన్నది నామ మాత్రమేనని టి.డి.పి తో సహ అందరికీ తెలిసినదే..అందుకే టి.డి.పి వాళ్లు డబ్బులు నామ మాత్రంగా ఖర్చు చేశారు.. మా వూళ్లో టి.డి.పి మనిషికి Rs200/- ఇచ్చారు..అదే జగన్ పార్టీ వాళ్లు..మనిషికి..Rs500/- నుండి Rs 1000/- దాకా అక్కడి వారి విలువను బట్టి పంచారు. కాంగ్రెస్స్ వారు Rs300/ నుండి Rs500/ దాక పంచారు అదీను కొన్ని చోట్ల మాత్రమే.. ! అలాగే టి.డి.పి వారు మా వూరిలో అస్సలు డబ్బులే పంచలేదు..కారణం ఎలాగూ ఓడిపోయెదానికి డబ్బులు ఎందుకు పంచాలీ అని భావన మా వూరి ఎమ్.ఎల్.ఏ.. మల్లెల లింఅారెడ్డి(టి.డి.పి). కాబట్టి మీరనుకునేంత స్వచ్చమైన ఎన్నికలు కావు ఇవి..ప్రజలంతా బ్రష్టుపట్టి వున్నారు.. ఇక మాజి ఎస్.ఎల్.ఏ యం.వి.రమణారెడ్డి వారి ఒప్పందం ప్రకారం తనకు డబ్బులిస్తే గాని జగన్ పార్టి తరుపున బూతులలో ఏజంట్లను కూర్చపెట్టను అంటు భీష్మించుకొన్నాడు.. అలా అర్థరాత్రిల్లు డబ్బులు పంపిణీ చేసీ మరీ జనాలను బూతులకు రప్పించుకొన్నారు..! ఇవన్ని తెరవెనుక సమ్గతులు..! బయట ప్రపంచంలో ఇవన్నె అవసరం లేదా..గెలిచాడా లేదా..అన్నదే ముఖ్యం కదా..గొర్రె ప్రపంచానికి.

    ReplyDelete
  4. పాపం ఈ కమల్ గారు జగన్ విజయాన్ని డౌన్ ప్లే చెయ్యడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ప్చ్చ్.

    ReplyDelete
  5. కమల్ గారూ ... కడపలో జగన్ గెలిచింది నీతిగా అని నా కార్టూన్ ఉద్దేశ్యం కాదు. జగన్ ఎలా గెలిచాడనేది ఈ రాష్ట్రంలో నోట్లో వేలు పెట్టుకుని చీక్కునే పసివాడికి కూడా తెలుసు. అంగ బలం అర్ధబలం కుల బలం సానుభూతి ఇవన్నీ కలిస్తే వచ్చిన ఫలితమే ... జగన్ గెలుపు. ఇక నా కార్టూన్ అంటారా ... జగన్ గెలుపులో పాలక ప్రతిపక్షాల ప్రత్యక్ష/ పరోక్ష కారణంగానే జరిగింది . అసలు అక్కడ ఆ రెండు పార్టీలు పోటీ పెట్టకుండా వదిలేసుంటే ఇంత మెజాఋట్ వచ్చి ఉండేది కాదు . పైగా అధినాయకులంతా కడపకు పోయి అక్కడి వాళ్ళను రెచ్చగొట్టారు . ఫలితం 5 లక్షల పై చిలుకు మెజార్టీ . అసలు ఇక్కడ పాలక ప్రతిపక్ష పార్టీల వ్యూహమే సరిగా లేదు . కడప వాసులను రెచ్చగొట్టిన ఫలితమే ఈ భారీ మెజార్టీ

    ReplyDelete
  6. అయ్య ఇంద్రసేనా..!! నేను చెప్పింది ఏ ఒక్క వ్యక్తి గురించి కాదు, ఎన్నికలు..వాటి తీరు గురించి చెప్పాను..అంతే గాని మీకులాగా ఒక వ్యక్తి మీద భిమానంతోనో..లేక దురాభిమానంతోనో చెప్పడం లేదు..! బయట ప్రపంచంలో చెప్పుకొనే హిపోక్రసీ విజయాల మీద నా కామెంట్ అంతే కాని..ఒకరిని కించపరచాలని కాదు మెచ్చుకోవాలని కాదు. వాస్తవమ్ గురించి మాట్లాడాను. కాంగ్రెస్స్ అధినాయుకులు కిందస్థాయి నాయుకులకు డబ్బు సంచులు ఇచ్చి ఓటర్లకు పంచమని ఇస్తే..! ఎలాగూ ఓడిపోయేదానికి ఏమ్దుకు పంచడం అని డబ్బు సంచులతో పరార్ అయ్యారు.. ఆ విషయం తెలిసి ఓటర్లు నానా గొడవలు కూడ చేశారు. ఇవన్ని వాస్తవాలు. ఓటర్లకు తెలుసు ఎవరు గెలిచినా ఒరిగేది ఏమి లేదని..అందినంతకాడికి పుచ్చుకుందాము..ఎలా రేపు గెలిచాక ఈ నాయకులు దోచుకోవడం షరామామూలే..మనం చూస్తూ ఊరుకోవడం మినహా ఏమి చేయలేము అన్నదే వారి ఉద్దేశం. ఇది ప్రస్తుత భారతదేశ్ ఎన్నికల తంతు.

    @అనాలసిస్ గారు. అక్కడ ఖచ్చితంగా జగనె గెలుస్తాడనీ చిన్నపిల్లవాడికి సైతం తెలుసు..ఆ విషయం కాంగ్రెస్స్ వారికి, టి.డి.పి వారికీ తెలుసు..! పోటీ పెట్టకపోతే ప్రజల్లో విస్వనీయత, నమ్మకం కోల్పోతామనే ఉద్దేశంతోనే నానా తంటాలు పడ్డారు, రెండు పార్టీలు కలిసి జగన్ మెజారిటీ తగ్గించాలని వృధా ప్రయాసె చేసారు..అలాగే మీరన్నట్లు..మిగతప్రపంచం అనుకొన్నట్లు అక్కడ ప్రతీది కులంతో బాటు డబ్బు ప్రభావమే ఎక్కువగా పనిచేసింది.అంతే గాని రెచ్చగొట్టడాలు..రెచ్చిపోవడాలు ఏమి లేవు..! అంతా ఏక పక్షంగానే జరిగాయి.

    ReplyDelete
  7. good discussion

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs