Sunday, November 01, 2009

తమిళులు నమ్మితే నెత్తినెక్కిన్చు కుంటారు

 వారం రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న చర్చ నన్నీ ' ఆర్టికల్ ' రాయడానికి పురుగొల్పింది. మన తెలుగుభాష కూ, తెలుగు తల్లికీ జరుగుతున్న అవమానం గురించి మీడియాలో జరుగుతున్న ' ఆంగ్ల చర్చలు ' చూస్తుంటే నాకు నవ్వాలో ... ఏడ్వాలో అర్ధం కాలేదు. మనమే మన తెలుగు తల్లిని, భాషనూ పాతరేస్తున్నామేమో  అని పిస్తుంది. మీడియా అయితే ఈ విషయంలో వందాకులు ఎక్కువే చదివినట్లుంది. టీవీ-9, N-tv  వాళ్ళు రోజూ తెలుగు ని ఇంగ్లీష్ లో ఉద్దరించేస్తున్నారు. ఈటీవీ-2 వారు ఈ విషయంలో బాధ్యతగానే ప్రవర్తిస్తున్నారు.

               ***********************************************       

దేశంలో ప్రాంతీయతత్వం, భాషాభిమానం మెండుగా వున్నవాళ్ళు ఎవరంటే .... తమిళులు. వాళ్ళకున్నంత భాషాభిమానం, ప్రాంతీయతత్వం  ఈ దేశంలో ఎవరికీ లేవు .... ఒకవేళ వుంటే అది తమిళుల తరువాతే !. "ఇద్దరు తెలుగు వాళ్ళు ఎదురుపడితే వాళ్ళు మాట్లాడుకునే భాష ఖచ్చితంగా తెలుగు కాదు .... ఇంగ్లీష్" - అని ఒక సామెత . కానీ ఇద్దరు తమిళులు కలిస్తే ఖచ్చితంగా వాళ్ళు తమిళంలోనే మాట్లాడుకుంటారు  ... అది అమెరికాలో  కావచ్చు లేదా ఆఫ్రికాలో  కావచ్చు.... ఆ స్థాయిలో ఉంటుంది వల్ల భాషాభిమానం. అందుకే హిందీ జాతీయభాష అయినప్పటికీ  దానిని  తలకెక్కించుకోలేదు ... మద్రాసు దూరదర్శన్ లో  ఉర్దూ వార్తలు ప్రసారమూ  కానీయలేదు (ఇప్పటి పరిస్థితి తెలియదు). పైగా హిందీని తమపై  రుదొద్దంటూ పెద్ద ఉద్యమమే( హిందీ వ్యతిరేకోద్యమం)  లేవదీసారు. తమ భాషకు, సంస్కృతికీ నష్టం జరిగితే వాళ్ళు సహించరు. ఒక్క భాషాభిమానమే కాదు తమ సంస్కృతి, సాంప్రదాయాలన్నా ఎంతో మమకారం. తమిళుల తరువాత అంతటి భాషాభిమానం, ప్రాంతీయతత్వం కలవాళ్ళు మలయాళీలు, కన్నడిగులు. ఎక్కడున్నా  అడ్డపంచే, అడ్డబొట్టు తో తమ ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటారు. అభిమానం కట్టలు తెంచుకుంటే మనుషులకు కూడా గుడులు కడతారు .... లేకపోతే కట్టిన గుళ్లనూ కూల్చేస్తారు. అంతటి ప్రాంతీయాభిమానం ఉండబట్టే పరాయి దేశం ( శ్రీలంక) లో  కూడా తమ ఉనికి, ప్రత్యేకతలకోసం పోరాటాలూ చేస్తున్నారు. మరి  అంతటి ప్రాంతీయభిమానులూ అభిమానించే ముగ్గురు వ్యక్తులు తమిళులు కాదంటే  ఆశ్చర్యమేస్తుంది. ఆ ... ముగ్గురూ పుట్టుకతో తమిళులూ కారు ... ఆ గడ్డపైన పుట్టలేదు. కానీ ఆ ముగ్గురు వాళ్ళకు ఆరాధ్యులు. ఇంతకూ ఆ ముగ్గురూ ఎవరు ? ఇంకెవరూ ...... పురుచ్చుతలై  M.G. రామచంద్రన్పురుచ్చుతలైవి జయలలితతలైవర్ రజనీకాంత్. ఈ ముగ్గురు సినీ రంగానికి చెందిన వారే  పైగా అక్కడ అతున్నత పదవులను అనుభవించినవారే( రజనీకాంత్ తప్ప). అంతటి అభిమానాన్ని సంపాదించుకోవడానికి వారు ఏం చేసారు? ....... ఏమీ చేయలేదు ...... తమిళులను నమ్మడం తప్ప. అదే ఆ ముగ్గురికీ బ్రతుకుతెరువునిచ్చింది, అభిమానాన్ని పంచింది, అందలమూ ఎక్కించింది. 
 


ఎం.జి.రామచంద్రన్: శ్రీలంక లో పుట్టిన ఈ ' మలయాళీ నాయర్ ' మద్రాసులో స్థిరపడ్డారు. తండ్రి మరణానంతరం కుటుంబ పోషణ కోసం డ్రామా ట్రూపు లో చేరి ఆపై సినీ నటుడయ్యారు. తమిళుల హృదయాలను గెలిచి ముఖ్యమంత్రి కూడా అయ్యారు.  జయలలిత జయరాం : మైసూరు లో పుట్టిన జయలలిత ' తమిళ అయ్యంగార్ ' కుటుంబానికి  చెందిన వారు. ఈమె తండ్రి మైసూరు సంస్థానంలో పనిచేసేవారు. ఆయన మరణాంతరం పేదరికం భరించలేక తల్లితో మద్రాసు చేరింది. తన 14 వ ఏటనే సినిమాలలో చేరి ఒక వెలుగు వెలిగింది. ఆ తరువాత ముఖ్యమంత్రి అయ్యారు.రజనీకాంత్ : బెంగళూరు లో  ' మరాఠీ'  కుటుంబములో పుట్టిన రజని అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. బెంగళూరు నగరంలో బస్ కండక్టర్ గా పనిచేసి ఆ తరువాత  మద్రాసు చేరి సినీ నటుడయ్యారు. ప్రస్తుతం ఆయన తమిళుల ఇలవేల్పు. ఈయన ఎప్పుడూ తను మరాఠీ అని చెప్పుకోడు. మానసికంగా తమిళుడుగానే చెలామణీ అవుతున్నాడు. త్యాగయ్య : అసలు పేరు కాకరాల త్యాగ బ్రహ్మం. మనవాడే .... తంజావూరు కి సమీపంలో ' తెలుగు' కుటుంబంలో పుట్టారు. ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు. ఈయన స్మృత్యర్ధం  ప్రతి సంవత్సరం తిరువయ్యూరు గ్రామంలో ' త్యాగరాజ అరాధనోత్సవాల' పేరుతో ప్రపంచ ప్రఖ్యాత కర్ణాటక సంగీత సమ్మేళనం జరుగుతుంది. అందులో పాల్గొనడం గొప్ప అదృష్టం గా భావిస్తారు.  హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఈయన విగ్రహం కూడా పెట్టినట్లు గుర్తు. ఆంధ్ర ప్రదేశ్ లో త్యాగయ్య అంటే తెలియనివారు ఉండొచ్చేమోగాని .... తమిళనాడులో ఆయన గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు.         

      తమిళులను చూసి మన తెలుగు వారు చాలా నేర్చుకోవాలి కదూ !? 
        తెలుగు వారందరికీ ఆంధ్రరాష్ట్ర అవతరణోత్సవ శుభాకాంక్షలు

5 comments:

 1. Telugus cannot write Telugu , cannot even utter a few words well . I hear expressions like " Decide ayyipoyyava , Anta seenu ledule , Kanfirmgana , Idoka kattingu - spread like virus from Kosta to Telangana .
  Wretched Telugus consider Music Dance and Literature to be frailities of Brahmins . How ever Telugu Brahmins have no pretensions to culture .They too are Telugus after all !
  Can they have any claim to a genius like Thyagaraju ? How may singers can they boast of ?
  A Telugu chap sings Ghazals with a dappu ! What a culture !
  Telugus returned to the atavistic life of gluttony ,lechery and sex . In Mouryan period Telugus were referred to as Dasyus ,who prospered by robbery and crime . These old qualities are in bloom again . Caste mania is the added grace .
  In foreign countries Telugus compare with lumpen elements of those societies . Bengalees, Malayalees, Marathis , Tamilians fare better .
  Yadha rajaa tadhaa praja !

  ReplyDelete
 2. అనానిమస్ గారూ,తమరు తెలుగు వారేనా?

  ReplyDelete
 3. hindi is not national language .
  http://www.merinews.com/article/hindi-our-national-language/126953.shtml


  dayachesi Hindi ni national language cheyakandi .

  ReplyDelete
 4. హిందీ ని జాతీయ భాష చేయడం నాకు కూడా ఇష్టం లేదండీ ......

  ReplyDelete
 5. English should be made as our national language. and everyone must take their mother toungue as second language.lot of telugu students take sanskrit in order to get good marks. this has to be condemned. third language can be sanskrit ,hindi or anything.

  ReplyDelete