Thursday, April 21, 2011

కార్పొరేట్ సంస్థలకు రాయితీలు అవసరమా ? (అందరూ చదవాల్సిన టపా)

ప్రపంచంలో ఏ పారిశ్రామికవేత్త/పెట్టుబడిదారు అయినా తనకొచ్చే లాభన్ని దృష్టిలో పెట్టుకుని/ తన సొమ్ముని పెంచుకోవడానికి వ్యాపారం చేస్తాడు లేదా ఆ రంగంలో పెట్టుబడి పెడతాడు.( ఇక్కడివరకూ పర్లేదు. అతన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు). అంతేగాని తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేద్దామనో ,ప్రజలకి ఉద్యోగిత కల్పిద్దామనో లేక వస్తు సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువద్దామనో కాదు . అతను చేసే వ్యాపారంలో కేవలం అతని లాభాపేక్ష మాత్రమే ప్రాధమికమైనవి. మిగతావన్నీ ప్రాక్టికల్‌గా కల్పితాలు. ప్రపంచంలో ఏ వ్యాపారవేత్త అయినా ఒక పరిశ్రమని/వ్యాపారాన్ని ఒక చోట ప్రారంభించాడంటే అక్కడ తనకు లాభం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అతను అంచనా వేసుకున్నడన్న మాట . అంతే గాని ఆ ప్రాంతం మీద ప్రేమతొనో, అక్కడివారిమీద  జాలితోనో కాదు. అలాంటప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆయా వ్యాపారవేత్తలకు / పరిశ్రమలకు రాయితీలెందుకు? ... వేలవేల ఎకరాలు (ప్రజల భూమి)  దొబ్బబెట్టడమెందుకు ? .ఒకవేళ ఇవ్వకపోతే నష్టం ఎవరికి ? . ఒక ప్రాంతంలో పరిశ్రమ పెట్టడం ఆ పెట్టుబడిదారుకు ఎంత అవసరమో అక్కడి ప్రజలకు కుడా అంతే అవసరం. అంతేగాని. ఆ ప్రాంతంలో పరిశ్రమ పెట్టినా అక్కడి స్థానికులకు ఒరిగేది తక్కువే . ఉదాహరణకు మన రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద పారిశ్రాఇకవేత్తలంతా (రిలయన్స్ లాంటివి) Man Power ని తమ సొంత రాష్ట్రాలయిన ముంబయ్ లేదా బీహార్ లేదా గుజరాత్‌లనుండే దిగుమతి చేసుకుంటున్నాయి తప్ప స్థానికులకు అవకాసాలివ్వడంలేదు . మరి అలాంటప్పుడు అవి ఇక్కడ పరిశ్రమలు పెట్టి ముడిసరుకుని దోచుకునే వారికి ప్రభుత్వ అండదండలెందుకు ? .. వారికి రాయితిలెందుకు ? ... వేల ఎకరాలు అప్పణంగా దొబ్బబెట్టడమెందుకు ?. ఇందుకు భిన్నంగా స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన కొన్ని చారిత్రక సంఘటనలను ఊటంకిస్తాను. పారిశ్రామిక విప్లవం మొదలైన తరువాత ఇంగ్లాండ్ ఒక వెలుగు వెలిగిపోయింది. భారతదేశం నుండి ముడి సరుకులని తేరగా కొని మళ్ళి తమ దేశం తీసుకెళ్ళి అక్కడ ప్రాసెసింగ్ చేసి మళ్ళి అధిక ధరలకు మన వారికే అమ్మేవారు . దానివలన మన వాళ్ళు తీవ్రంగా నష్టపోయేవాళ్ళు . తక్కువ ధరకు మడిసరుకుని ఇక్కడ కొని అధిక ధరలకు Finished goods ను మన వాళ్ళకు అమ్మేవారు ( అంటె ఇప్పుడు మన కృష్ణా గోదావరి బేసిన్ లోని ముడి చమురును గుజరాత్ తీసుకెళ్ళి  అకడ Refine చేసి మళ్ళీ ఆంధ్రవాళ్ళకు అధిక ధరలు గ్యాసు చమురు అమ్మినట్టు అన్న మాట ). దీనివలన స్థానికులైన భారతీయులు తమ విలువైన ముడి సరుకుని కోల్పోవడమేగాక , ఇక్కడ పరిశ్రమలు లేకపోవడం చేత ఉద్యోగాలు కూడ లేకుండా పోయాయి  (అప్పట్లో బ్రిటీషువాళ్ళు నామమాత్రంగా తప్పనిసరి కొన్ని పరిశ్రమలు స్థాపించారు. అదంతా అప్పటి పారిశ్రామిక విప్లవ ఫలితాలను అందిపుచ్చుకోవడానికే తప్ప భారతీయుల మీద ప్రేమతో మాత్రం కాదు ). దీని గమనించిన మన మేథావులు రవీంద్రనాథ టాగూర్  లాంటి వాళ్ళు బెంగాల్‌లో స్థానికులకు ఉద్యీగిత కల్పించడం కోసం తామే చందాలు వేసుకుని బెంగాల్ కెమికల్స్ ఫేక్టరీ లాంటివి కొన్ని స్థాపించారు (ఇదంతా స్వదేశీ ఉద్యమంలో భాగంగా జరిగింది). సర్ జగదీష్ చంద్రబోస్ వంటి శాస్త్రవేత్తలు ఇందుకు Technical support ను అందించారు . దీనిలో లాభాపేక్ష లేదు. కేవలం స్వదేశీయులకు ఉద్యోగిత కల్పించడమే ఇందులో ప్రధాన ధ్యేయం . చెప్పండి మన పారిశ్రామిక వేత్తలకు  రాయితీలు అవసరమా ? ఒకవేళ వాళ్ళకు రాయితీలు ఇవ్వకపోయినా ఎక్కడ మౌళిక సదుపాయాలు ఉంటే అక్కడ పరిశ్రమలు ఎలాగూ స్తాపిస్తారు .ప్రజలపై ఉన్న ప్రేమతో కాకపోయినా తమ పెట్టుబడులను రెట్టింపు చేసుకోవడానికైనా ఈ పని చేస్తారు .అది వారికి అత్యవసరం .  మొన్నటికి మొన్న టాటాల నానో కారు ఫేక్టరీ (లక్ష రూపాయల కారు) కోసం భూమిని మేమిస్తాం అంటే మేమిస్తామని అన్ని ప్రభుత్వాలూ ( చివరికి కమ్యూనిస్టులు కూడా ) ఎగబడ్డాయి . ప్రజలు కన్నెర్ర జేయడంతో ఎర్ర ప్రభుత్వం తోకముడిచింది . ఇప్పుడు అదే ఎర్ర ప్రభుత్వం  కొంప ముంచబోతోంది. ఇప్పుడు నానో కారు ధర ఎంతో కూడా తెలీదు. అప్పట్ళొ ఆ భూమిని ప్రజలకు చౌకగా కారును అందిస్తామని కొట్టేసుంటారు  టాటాలు. మరి నానో కారు ఇప్పుడు మార్కెట్లో చౌకగా ఉందోలేదో తెలీదు .   
ఇక కార్పొరేట్ సంస్థలకు దోచిపెడితే జరిగే దీర్ఘకాలిక నష్టాన్ని చూడండి           

     కార్పొరేట్ సంస్థలు ఏదో ఒకరోజు దేశాన్ని కబళిస్తాయనిపిస్తుంది నాకు . ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు (ఎవరైనా సరే) అక్కడి కార్పొరేట్ సస్థల తరపున లాబీయింగ్ చేస్తాడట. అందుకేనేమో అక్కడి అధ్యక్ష ఎన్నికలలో ప్రత్యక్షంగా విరాళాలు తీసుకోవడం ఆనవాయితీ . తమకు ప్రయోజనం కలగకపోతే వాళ్ళు మాత్రం ఎందుకిస్తారు విరాళాలు. అసలు అక్కడి అధ్యక్షున్ని ఆ దేశపు కర్పొరేట్ సంస్థలే నిర్ణయిస్తాయట. దానికి అనుగుణంగానే అక్కడి ఎన్నికల క్రతువు మొదలవుతుందట . మనకు కూడా ఈ ఆనవాయితీ ఉంది... కాకపోతే బయటకి తెలీదు. ఇప్పుడున్న కార్పొరేట్ సంస్థలన్నీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీకి నిధులు  సమకూరుస్తాయట. కార్పొరేట్ సంస్థలు ఆ పార్టీ ఈపార్టీ అని కాకుండా అన్ని పార్టీలకు ఉదారంగా విరాళలు ఇస్తాయి ( ఇది బహిరంగ రహస్యమే) .వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న ప్రభుత్వాలు ఆ కంపెనీల కోసం గాకుండా ప్రజలకోసం పని చేస్తాయని ఎలా అనుకుంటాం . మన దేశంలో బ్రిటీష పాలన( ఈస్టిండియా కంపెనీ పాలన) కూడా ఇలానే వ్యాపారంతో మొదలైంది . చివరికి ఏమైంది?...  రెండొందల  ఏళ్ళు  దేశాన్ని బానిసత్వంలోకి నెట్టింది. సర్ థామస్ రో మొఘల్ చక్రవర్తి జహంగీరు వద్దకు పోయి  వ్యాపారంకోసం జాగా అడగడంతో మొదలైన ఈ కార్పొరేట్ ఎత్తుగడ ... స్థానిక చక్రవర్తులను నయానో భయానో దారిలోకి తెచ్చుకుని దేశాన్ని తమ చెప్పుచేతల్లోకి తీసుకుంది . ఆనాడే మొఘలులు ఈ అనర్ధాన్ని ఊహించి ఉంటే యూరోపియన్లను పశ్చిమ తీరంలో అడగుపెట్టనిచ్చేవారుకాదేమో ? .  ఇప్పుడున్న మన ప్రభుత్వాలకు కూడా దూర దృష్టి లేకపోఈ చరిత్ర పునరావృతమౌతుందేమో ఎవడికి తెలుసు ?   ఇప్పటికే క్రికెట్‌ను కార్పొరేట్ సంస్థలు ఆక్రమించుకున్నాయి. భవిష్యత్తులో ఇంకేమి ఆక్రమించుకుంటారో ఈ కార్పొరేట్ మాయగాళ్ళు .
(అమెరికాలో పెట్టుబడి ఎలా పుట్టింది ? అని ప్రవీన్ శర్మ రాసిన ఆర్టికల్ను చూసి అప్పుడెప్పుడో రాసిపెట్టుకున్న అస్త్రాన్ని బయటకు తీసి ప్రచురిస్తున్నాను http://telugu.stalin-mao.in/#!/50165666)

1 comment:

  1. When a company is started, there are many direct and indirect benefits. If there are many employees, then it would create indirect employment, and that mainly goes to the local people. The indirect employment would be around 3-4 times to the direct employment.

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs