Thursday, October 01, 2009

ప్రజారాజ్యమా? లేక పరాయివాళ్ళ రాజ్యమా?





  ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి చూస్తుంటే చాలా జాలేస్తుంది. అక్కడ చిరంజీవి మాట కంటే ఇతర పార్టీల మాటే చెల్లుబాటు అవుతున్నట్లుంది. ఉన్న కొద్దిమంది నాయకులను కాపాడుకోవడానికి మెగాస్టార్ తంటాలు పడుతున్నారు. పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలపై పట్టు లేనట్లు కనిపిస్తుంది. పార్టీకి వ్యూహం, దిశానిర్దేశం కొరవడింది - గాలి(రాజకీయగాలి) ఎటు వీస్తే అటు పోతున్నట్లుంది. యిటువంటి సందర్భాలలో మెగాస్టార్ పార్టీని నడపగలడా? అనే సందేహం సహజంగానే ఉదయిస్తుంది. అనాలోచితంగా ప్రకటనలు చేయడం  చిరంజీవికి అలవాటైపోయింది. మొన్నటికి ...మొన్న టెక్కలి అసెంబ్లీ ఉపఎన్నికలలో తమ అభ్యర్ధిని నిలపమన్న చిరంజీవి మాట తప్పారు. చివరికి ఆ ఎన్నికలో తమ అభ్యర్ధి డిపాజిట్ కోల్పోవడం ... దానికి కారణం తమ అభ్యర్ధి చేత విస్తృతంగా ప్రచారం చేయించకపోవడమే అని శెలవిచ్చారు. ఇదంతా చూస్తుంటే ... "వెనకటికి ఒకడు మింగలేక ఈ రోజు మంగళవారం అన్నాడట" అనే సామెత గుర్తురాకమానదు.  మంచైనా చెడైనా రాజకీయాల్లో కాస్తో కూస్తో కమిట్మెంట్(committment) అవసరం. అదిలేకపోతే జనం నమ్మరు.                                           
                                      

            భూమా నాగిరెడ్డి ....    శోభా నాగిరెడ్డి ....     కాటసాని రామిరెడ్డి                                             
   నిన్నటికి ...నిన్న ప్రజారాజ్యం పార్టీ కర్నూలు నాయకుడు భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిలు పావురాలగుట్ట వరకూ అనుసరించి జగన్ ను పరామర్శించారు. తదనంతరం జరిగిన నల్లకాలువ సభకు తమ అనుచరులతో హాజరవడమేగాక, ఆ సభకు జనాన్ని కూడా తరలించడం ప్రజారాజ్యం పార్టీ శ్రేణులకు మింగుడుపడని విషయం. ఈ సందర్భంలో వారు " జగన్ సి.ఎం అయితేబాగుటుంది" అని వాఖ్యానించారు. తండ్రి మరణంతో పుట్టెడు దుఖంలో నున్న జగన్ ను పరామర్శించడంలో తప్పులేదు కాని రాజకీయప్రాధాన్యత( జగన్ సి.ఎం కావాలన్నా డిమాండ్ల నేపధ్యంలో) సంతరించుకున్న నల్లకాలువ సభకు జనాన్ని తరలించడం మరీ విడ్డూరం. రాజశేఖర రెడ్డి మరణానికి ముందే ఈ ముగ్గురూ కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్దమైనట్లు వార్తలొచ్చాయి. ఇదే విషయాన్నీ మీడియా మెగాస్టార్ వద్ద ప్రస్తావించగా ... తన పార్టీ వారు చేసిన దానికి ఏం చెప్పాలో తెలీక ... "అది వారి వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు" అని ముగించేశారు. బహూశా వారిపై చర్య తీసుకుంటే తన పార్టీ మరింత బలహీనపడుతుందని మెగాస్టార్ 'మెగా(MEGA)' భయం కావచ్చు. ఒక పార్టీలో ఉండి వేరొక పార్టీ సభకు జనాన్ని తరలించడం క్రీడాస్పూర్తా? లేక రాజకీయస్పూర్తా?. రాజకీయాల్లో క్రీడాస్పూర్తులుండవు - ఉన్నదల్లా రాజకీయస్పూర్తులే. "తనువు ఒక పార్టీలో - మనసు వేరొక పార్టీలో" పెట్టే పరాయివాల్లతో కలిసి మెగాస్టార్ సామాజికన్యాయం ఏ విధంగా సాధిస్తాడో?. ఇంతకూ ... ఆ ముగ్గిరికీ స్ఫూర్తి ఎవరు? తమ సామాజికవర్గానికి చెందిన వై.ఎస్. రాజశేఖర రెడ్డా? లేక సామాజికన్యాయం చేస్తానన్న చిరంజీవా? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న మాత్రం కాదు.            

No comments:

Post a Comment

కూడలి
మాలిక: Telugu Blogs