Tuesday, October 20, 2009

రాజకీయాల్లో సినిమా స్టార్లు


రోనాల్డ్ రీగన్: అమెరికా, రష్యాల మధ్య ప్రచ్చన్న యుద్ధం(COLD WAR)  కాలంలో అమెరికా అధ్యక్షుడిగా  రెండు సార్లు(1981 - 89 ) పనిచేసారు. అప్పట్లో  భారత్ - అమెరికా ల మధ్య పెద్దగా సంబంధాలుండేవి కాదు. దానికి కారణం భారత్ రష్యాను సమర్ధించడమే. అంతకు ముందు  కాలిఫోర్నియా  గవర్నర్ గా పనిచేసారు. ఈయన ఇద్దరు భార్యలు  జేన్ విమెన్ , నాన్సీ డేవిస్ లు కూడా నటులే.  ఈయన  మొదటి  సినిమా ' లవ్  ఈస్  ఆన్  ది  ఎయిర్ '.  థిస్ ఇస్ ది ఆర్మీ, డార్క్ విక్టరీ , ది కిల్లర్స్ మొదలైన సినిమాలలో నటించారు.  2004, జూన్ 5 న అల్జీమర్స్ వ్యాధితో మరణించారు.
__________________________________________________________ 

జోసఫ్ ఎస్ట్రడా: ఫిలిప్పీన్స్ సూపర్ స్టార్, దాదాపు 100 సినిమాలలో నటించారు. సినిమా గ్లామరు తో ఫిలిప్పీన్స్ 13 వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తన అవినీతి పాలన కారణంగా పదవి నుండి తొలగింపబడ్డారు. అధ్యక్షుడు కాక  ముందు సాన్ - జాన్ నగర మేయర్ గాను, సెనేటర్ గాను, ఆ తరువాత ఫిలిప్పీన్స్  ఉపాధ్యక్షుడిగానూ పనిచేసారు. ఈయన తరువాత  గ్లోరియో ఆరియో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఈమె బిల్ క్లింటన్ క్లాస్మేటు
 ____________________________________________________________

ఆర్నాల్డ్  స్క్వార్జ్ నెగ్గెర్ : ఆస్ట్రియాలో పుట్టిన ఆర్నాల్డ్ అమెరికాకు వలసవచ్చాడు. సినిమాలనుండి రాజకీయాలలోకి వచ్చిన ఈ 'బాడీ బిల్డర్' TERMINATOR  సీరీస్ చిత్రాల ద్వారా భారతీయులకు కూడా  పరిచయమే. ప్రస్తుతం  కాలిఫోర్నియా గవర్నర్ గా ఉన్నారు. వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో  రిపబ్లికన్  పార్టీ  తరపున పోటీ చేస్తానని, అది కుదరకపోతే (అమెరికా లో పుట్టని వ్యక్తులు అధ్యక్ష పదవికి అనర్హులు) తన స్వంత దేశమైన ఆస్ట్రియా అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ప్రకటించారు. టోటల్ రీ కాల్, ప్రిడేటర్, టెర్మినేటర్ - 1, 2, 3, ట్రు లైస్,బెట్మేన్  అండ్ రాబిన్, ఎరేజర్  మొదలైన చిత్రాలలో నటించారు. ఈయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు.    
__________________________________________________________________


విజయ కుమారతుంగ: శ్రీలంక సూపర్ స్టార్. 114 సినిమాలలో  నటించారు. నంగురన్ అనే తమిళ సినిమాలో కూడా నటించారు. ఏ పదవి  చేపట్టనప్పటికీ శ్రీలంకన్ మహాజన్ పార్టీ ని స్థాపించి రాజకీయాలలో చురుగ్గా వుండేవారు. శ్రీలంక ప్రధానిగా పోటీ చెయాలని భావించారు. ఈలోపు  దురదృష్టకర రీతిలో హత్య చేయబడ్డారు. శ్రీలంక రాజకీయ కుటుంబానికి చెందిన సిరిమవో  బండారునయకే  కూతురు చంద్రిక ను వివాహమాడారు. ఈయన భార్య చంద్రిక కుమారతుంగ గతంలో  శ్రీలంక ప్రధానమంత్రి,  అధ్యక్షరాలిగా ఉన్నారు.
__________________________________________________________________


క్లింట్ ఈస్ట్ వుడ్హాలీవుడ్  నటుడుగతంలో కార్మెల్ పట్టణ మేయర్ గా రిపబ్లికన్ పార్టీ తరపున పనిచేసారు. కౌ బాయ్ సినిమాలనగానే క్లింట్ ఈస్ట్ వుడ్ గుర్తుకొస్తాడు. 'వేర్ ఈగల్స్ డేర్' సినిమాలో నటించినందుకు అప్పట్లోనే (1968 లో )  8 లక్షల అమెరికన్ డాలర్లను పారితోషికంగా తీసుకోవడం ఒక రికార్డ్.  'మిలియన్ డాలర్ బేబి' సినిమాకు  బెస్ట్ డైరెక్టర్ గా ఆస్కార్ అవార్డ్  అందుకున్నారు.

__________________________________________________________________
మహేంద్ర రాజపక్సే: ప్రస్తుత శ్రీలంక అధ్యక్షులు. అంతకుముందు ప్రధానమంత్రిగా పనిచేసారు.  శ్రీలంకలో మరో రాజకీయ కుటుంబానికి చెందిన రాజపక్సేరాజకీయాలలోకి రాకముందు సినిమాలలో నటించారు. తండ్రి మరణాంతరం రాజకీయల్లోకొచ్చారు. ________________________________________________________________


కరుణానిధి: ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి గా ఉన్నారు. గతంలో నాటక రచయితగానూ, సినిమాలకు స్క్రీన్ ప్లే రచయితగానూ పనిచేసారు. దాదాపు 70 సినిమాలకు స్క్రీన్ ప్లే సమకూర్చారు. అందులో తన రాజకీయ ప్రత్యర్దులైన ఎం.జి. ఆర్ , జయలలిత సినిమాలు కూడా ఉండటం విశేషం. ఈమధ్యనే( 2005 లో )  మీనా నటించిన కన్నమ్మ అనే తమిళ సినిమాకు స్క్రీన్ ప్లే , డైలాగులు సమకూర్చారు.
__________________________________________________________________

ఎం.జి.రామచంద్రన్: తమిళుల ఆరాధ్యుడు. భారత దేశంలో అత్యున్నత పదవిని చేపట్టిన మొదటి సినిమా నటుడు. ఈయన నటించిన రాజకుమారి సినిమాకు రాజకీయ ప్రత్యర్థి కరుణానిధి మాటలు రాయడం విశేషం. అప్పట్లో ఇద్దరు మంచి మిత్రులు. ఆ తరువాత స్వంతంగా పార్టీ (AIADMK) స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నో జనరంజక పధకాలను ప్రవేశపెట్టి తమిళుల హృదయాలలో నిలిచిపోయాడు. బడి పిల్లలకు  మధ్యాహ్న  భోజన పధకం ఈయన సృష్టే . ఈయన్ను ఆదర్శంగా తీసుకుని  ఆ తరువాత ఎంతోమంది సినిమా నటులు రాజకీయల్లోకొచ్చారు. సహ నటుడు మోహన్ రాధా ( నటి రాధిక తండ్రి) రివాల్వర్ తో కాల్పులు జరపగా  మెడలో బుల్లెట్ దూసుకుపోయింది. ఇదంతా ప్రత్యర్థి కరుణానిధి కుట్ర అని అప్పట్లో  అనుమానించారు. కిడ్నీ వ్యాధితో మరణించారు.
__________________________________________________________________


ఎన్.టి రామారావు: ఆంధ్రుల ఆరాధ్య దైవం. తెలుగు సినీ పరిశ్రమలో నాటికీ నేటికీ రారాజు. ఇండియాలో అతున్నత పదవి చేపట్టిన రెండో సినీ నటుడు. తెలుగుదశం పార్టీ స్థాపించి 9 నెలల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఒక రికార్డ్. ఎం.జి.ఆర్ , ఎన్.టి.ఆర్ లు సమకాలీనులు. ఎం.జి.ఆర్ లానే ఎన్.టి.ఆర్ పై కూడా హత్యాయత్నం జరిగింది. మల్లెల బాబ్జీ అనే వ్యక్తి కత్తితో దాడి చేసాడు. రాముడు, కృష్ణుడు అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఎన్.టి.ఆరే. 2 రూపాయలకు కిలో బియ్యం, జనత వస్త్రాలు  మొదలైనవి ఈయన పధకాలు. పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పులు( మాండలిక వ్యవస్థ, పటేలు, పట్వారీ వ్యవస్థ రద్దు,ప్రజల వద్దకు పాలన ) తీసుకువచ్చిన ఘనత ఈయనదే.
_________________________________________________________________
_
జయలలిత: ఎం.జి.ఆర్ మరణం తరువాత రాజకీయల్లోకొచ్చిన జయ పూర్వ రంగంలో ఆయనతో కలిసి నటించారు. ఆయన స్థాపించిన పార్టీ (AIADMK) తరపునే ముఖ్యమంత్రి అయ్యారు. ఎం.జి.ఆర్, జయలలితలది హిట్ పెయిర్. ప్రస్తుతం అదే పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్నారు.
 _________________________________________________________________


 
జానకీ రామచంద్రన్: ఎం.జి.ఆర్ భార్య, ఆయన సహ నటి. ఆయన మరణం తరువాత నెలరోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు.


__________________________________________________________________


విజయకాంత్: అసలు పేరు విజయరాజ్ అలగిరిస్వామి నాయుడు. తమిళనాడులో అందరు కెప్టెన్ అంటారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించారు.  ఆంద్ర, కేరళలో కూడా అభిమానులున్నారు. కెప్టెన్ ప్రభాకర్, పోలీస్ అధికారి, వనతి పోల్ ( మా అన్నయ్య - రాజశేఖర్ ), రమణ( టాగూర్ - చిరంజీవి ), చిన  గౌందర్ ( చిన రాయుడు - వెంకటేష్) , సిందూర పువ్వు మొదలైన సినిమాలలో నటించారు. DMDK పార్టీ  స్థాపించి గత అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రమంతా పోటీ చేసారు , అయితే ఆయనొక్కడే  ( విరుదాచలం నుండి)  గెలిచాడు. ఈయన్ పార్టీ చీల్చిన ఓట్ల వలన AIADMK  పార్టీ  నష్ట పోయినట్లు  రాజకీయ విశ్లేషకుల అంచనా.
__________________________________________________________________


చిరంజీవి: మెగాస్టార్ గా అభిమానులకు పరిచయం. తన డాన్సులు, ఫైటింగులతో ప్రేక్షకులకు దగ్గరై వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఈయన నటించిన ఖైదీ తెలుగు సినీ రంగంలో ఒక 'ట్రెండ్ సెట్టర్'. అందరివాడు కావాలనుకున్నారు .... కానీ రాజకీయాల్లో ప్రవేశించి కొందరివాడయ్యాడు. 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాష్ట్రమంతా పోటీ చేసారు. కానీ ప్రజలు తిరస్కరించారు.  ఈయన పార్టీ చీల్చిన ఓట్ల వలన తెలుగుదేశం పార్టీ ఓటమి చవిచూసింది.వీళ్ళేగాకుండా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ చిత్ర రంగాలకి చెందిన ఎంతోమంది నటులు రాజకీయాల్లో ఉన్నారు.

రాజకీయాల్లో ప్రవేశించడానికి సిద్దంగా ఉన్న నటులు : రజనీకాంత్, విల్ స్మిత్, బ్రాడ్ పిట్ 

                      విల్ స్మిత్             బ్రాడ్ పిట్                   రజనీకాంత్    
రజనీకాంత్: తమిళ సూపర్ స్టార్. దేవుడు శాసిస్తే రాజకీయాల్లోకి వస్తానంటున్నారు.
విల్ స్మిత్: హాలీవుడ్ సూపర్ స్టార్.15 సంవత్సరాలు ప్రణాళికాబద్దంగా శ్రమిస్తే అమెరికా అధ్యక్షుడినవుతానంటున్నారు
బ్రాడ్ పిట్: హాలీవుడ్ సూపర్ స్టార్, త్వరలో డెమాక్రటిక్ పార్టీలో చేరడానికి సిద్దంగా వున్నారు.

No comments:

Post a Comment