Monday, November 09, 2009

సోనియా గాంధీ ఈజ్ స్పాన్సర్డ్ బై గాంధీ - నెహ్రూ ఫ్యామిలీ

వరు చెప్పారో గుర్తు లేదు కానీ ... " నీవు ప్రజలకు సేవ చెయ్యాలంటే రాజకీయాల్లో మాత్రం చేరకు .... నీవు ప్రజలకు చేసే అతి పెద్ద సేవ అదే !!"

ఎవరైనా ఒక రంగంలో విఫలమయ్యారనుకోండి ... మరొక రంగంలో ప్రయత్నిస్తారు ... అక్కడా విఫలమయ్యారనుకోండి .... వేరొక రంగంలో ప్రయత్నిస్తారు .... బ్రతకాలి కదా !? . కానీ రాజకీయ రంగంలో ప్రవేశించినవారు సాధారణంగా విఫలం కావడం అంటూ జరగదు .... సఫలం అయ్యేవరకూ ( ఎమ్మెల్యేనో, ఎంపీనో , మంత్రో అయ్యేవరకూ) అక్కడే ప్రయత్నిస్తూ ఉంటారు ... అదే రాజకీయ మహత్యం. ఒకప్పుడు రాజకీయాల్లో చేరాలన్నా...  రాణించాలన్నా  నాయకత్వ లక్షణాలూ, సేవాభావం, ఉద్యమ నేపధ్యం  అర్హతలుగా ఉండేవి . కాలం మారింది ... కాలంతో పాటూ  అర్హతలూ మారాయి ... అర్హతలతో పాటూ  రాజకీయమూ మారింది. ఇప్పుడు  రాజకీయాల్లో చేరాలంటే ఇవేవీ అవసరం లేదు ... డబ్బు, పలుకుబడి ఉంటే చాలు .... లేదా ఏదైనా రాజకీయ నాయకుడి కొడుకో, మనవడో , దగ్గర బంధువో అయ్యుంటే చాలు .... రాత్రికి రాత్రే నాయకుడై పోవచ్చు .... అంతా ఆ పెద్దాయనే చూసుకుంటాడు. రాజకీయాల్లోకి రావడం తప్పు కాదు ... అందుకు తగిన 'గ్రౌండ్ వర్క్' అవసరం. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నది చాలా వరకు స్పాన్సర్డ్ లీడర్లే ( Sponsored Leaders ). వాళ్ళకు ఏ విధమైన అర్హతలూ ఉండవు ... ఉన్నదల్లా ఏదో ఒక నాయకుడికి కొడుకో, బంధువో అయ్యుండడమే. పక్క వాడ్ని అనగదొక్కడమే నాయకత్వలక్షణాలు అనుకుంటారు వీళ్ళు. నాయకత్వం వహించడానికే మేము పుట్టాము(BORN TO LEAD) అన్నట్లుంటుంది వీళ్ళ వరస. పైగా ప్రజలు తమను ఆదరిస్తున్నారని వాదిస్తుంటారు. వీరు తమకున్న ' Brand Name ' తో మిగతా వాళ్ళను తొక్కుకుంటూ ముందుకెళ్ళి పోతుంటారు .... పాపం మిగతా వాళ్ళు ఇవేమీ లేక( అర్హతలూ, నాయకత్వ లక్షణాలూ ఉన్నప్పటికీ) వెనకబడి పోతుంటారు. డిల్లీ నుండి గల్లీ దాకా  వీళ్ళదే హవా.  దారుణం ఏమిటంటే ... ప్రజలు   కూడా ఇటువంటి ' Sponsored Candidates' నే గెలిపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది ... నాయకత్వాన్ని బలవంతంగా మనపై రుద్దుతున్నట్లు లేదూ !????. ప్రస్తుతం మనకున్న నాయకుల్లో ఎంతమంది కింది స్థాయి నుండి వచ్చారు ?  ఎంతమందికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ?  ఎంత మందికి సేవాభావం ఉంది ? - అంటే సమాధానం చెప్పడం కష్టం. ' షార్ట్ కట్ ' లో ఎంతమంది నాయకులయ్యారు అంటే  .....  ' చాలామంది' -  అని చెప్పొచ్చు. ఇప్పుడు అలాంటి వాళ్ళను కొంతమందిని చూద్దాం.


సోనియాగాంధీ
స్పాన్సర్డ్ బై : గాంధీ - నెహ్రూ ఫ్యామిలీ
అర్హతలు: ఇందిరా గాంధీ కోడలు, రాజీవ్ గాంధీ భార్య.
పూర్వానుభవం : ఏమీ లేదు, ఏకా ఎకీన AICC అధ్యక్షురాలు అయిపోయారు.


రాహుల్ గాంధీ 
స్పాన్సర్డ్ బై : గాంధీ - నెహ్రూ ఫ్యామిలీ
అర్హతలు : నెహ్రూ - ఇందిరల మనుమడు, రాజీవ్ గాంధీ కొడుకు
పూర్వానుభవం : ఏమీలేదు, గత ఐదున్నరేల్లనుండి ఏం.పి, ఈ మధ్యే  AICC కార్యదర్శిగా నియమింపబడ్డారు (అదీ డైరెక్టుగా.. )


నవీన్ పట్నాయక్
స్పాన్సర్డ్ బై : బిజూ పట్నాయక్ ఫ్యామిలీ 
అర్హతలు: స్వర్గీయ బిజూ పట్నాయక్ తనయుడు  
పూర్వానుభవం : ఏమీ లేదు, తండ్రి మరణానంతరం ఒడిస్సా లో అడుగుపెట్టారు.అంతవరకూ విదేశాల్లో గడిపారు. 



హెచ్.డి.కుమార స్వామి
స్పాన్సర్డ్ బై : దేవేగౌడ
అర్హతలు: మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ
పూర్వానుభవం: ఏమీలేదు ... కాకపోతే ముఖ్యమంత్రి కాకముందు ఆయన సుప్రసిద్ధ కన్నడ సినీ నిర్మాత, ఎగ్జిబిటర్, డిస్త్రిబ్యూటార్.      



జగన్మోహన రెడ్డి
స్పాన్సర్డ్ బై : వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి
అర్హతలు : దివంగత ముఖ్యమంత్రి  వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఏకైక ముద్దుల తనయుడు
పూర్వానుభవం : ఏమీ లేదు,గత ఐదు నెలలుగా ఏం.పి.ఈయన తండ్రి ఏవో కొన్ని పనులు పూర్తిచేయకుండా వెళ్ళిపోయారంట... అవి నేను తప్ప ఇంకెవరూ చేయలేరు...చేయకూడదు ... అందుకే నన్ను సి.ఎం చేయండి అంటున్నాడు ఈయనగారు .           

ఇక రాష్ట్రం నుండి గల్లీ స్థాయి వరకూ ఇలాంటి వాళ్ళకు లెక్కేలేదు. ఇలాంటి మరికొంతమంది గురించి మరోసారి .

2 comments:

  1. very small list...here some more..

    Chandrababu Naidu, Purandhareswari, Balakrishna and family, KTR, DS son, KK son, PJR son..(AP)

    Kumaraswamy and Co (Karnataka)

    Jayalalitha, Stalin, Alagiri (TN)

    Chawan, Dhakares (Maharastra)

    Omar Abdullah (J&K)

    Scindhias (MP)

    ...
    ..
    ..

    ReplyDelete
  2. ఇది మిగతా నాయకుల చేతకానితనం అని ఎందుకు అనుకోకూడదు. ముల్లును ముల్లుతోనే తీయాలి. రాజకీయాలంటేనే ఎత్తుకు పై ఎత్తులు, కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లని చాణక్యుడి కాలం నుంచి ఉన్నాయి కదా మనకు.

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs