Saturday, October 17, 2009

భారత రాజకీయాల్లో బ్రహ్మచారులు


భీష్ముడు, అటల్ బీహారి వాజపాయ్, అబ్దుల్ కలామ్, మాయావతి, జయలలిత, మమత బెనర్జీ, ఉమాభారతి, నరేంద్ర మోడి, నవీన్ పట్నాయక్, రాహుల్ గాంధీ ..... పరిచయం అవసరంలేని వ్యక్తులు, వీళ్ళందరికీ కొన్ని పోలికలున్నాయి. వీళ్ళంతా భారత రాజకీయాలలో చాలా ఉన్నత స్థాయి వ్యక్తులు.... అంతే కాదండి వీల్లెవారు పెళ్లి చేసుకోలేదు - బ్రహ్మచారులు.      



భీష్ముడు: పురాణ కాలానికి చెందిన భీష్ముడు బహూశా  భారత రాజకీయాలలో మొట్ట మొదటి బాచిలర్ కావచ్చు. ప్రతిజ్ఞా బద్దుడై చివరికంటూ బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు.





అటల్ బిహారీ వాజపాయి :   ప్రస్తుత కాలానికి చెందిన వాజపాయీ పెళ్లి  చేసుకోలేదు . ఈయనకు ఇద్దరు దత్త పుత్రికలు. ఈయన భారతదేశ మొదటి బ్రహ్మచారి ప్రధానమంత్రి.


అబ్దుల్ కలామ్: తన జీవితమంతా శాస్త్ర,సాంకేతిక పరిశోధనలకే పరిమితం చేసిన ఈ 'మిస్సైల్ మేన్' ఎందుకో మరి పెళ్లి చేసుకోలేదు. బహూశా  ... పరిశోధనలలో మునిగి పెళ్లి విషయం మర్చిపోయి ఉండవచ్చు.




జయలలిత:ఎం.జి.ఆర్ మరణం తర్వాత రాజకీయాల్లోకొచ్చిన జయ పెళ్లి చేసుకోలేదు. సహ నటులు ఎం.జి.ఆర్,శోభన్ బాబు లతో సంబంధాలున్నట్లు పత్రికలలో వార్తలు వచ్చేవి.జయ జీవితం ఆది నుండీ వివాదాస్పదమే."నేను ఈమెను కుమారి అని పిలవాలా? లేక శ్రీమతి అని పిలవాలా?" - అని కరుణానిది జనాన్నిఅడుగుతున్నారు.

మమత బెనర్జీ : ఈమె రాజకీయ జీవితమంతా పోరాటాలమయం. ఈమె కూడా పెళ్ళికి దూరంగానే ఉన్నారు.కమ్యునిస్టులపై ఒంటి కాలిపై లేస్తుంటారు.  



మాయావతి: ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి.
ఘజియాబాద్(యు.పి) లో పుట్టిన ఈ బెహన్(సోదరి) కూడా పెళ్లి చేసుకోలేదు.భారత మొదటి దళిత ప్రధాని నేనే అవుతానని ప్రకటించారు.



ఉమాభారతి: మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బి.జె.పి సన్యాసిని. సోనియా ప్రధాని అయితే గుండు చేయించుకున్టానని ప్రకటించారు. 'ఫైర్ బ్రాండ్' అని పేరు. అద్వానీపై కత్తిగట్టి బి.జె.పి నుండి బైటకొచ్చారు.

నరేంద్ర  మోడి :ఈయన  గుజరాత్ ముఖ్యమంత్రి . RSS రాజకీయాలలో పుట్టిపెరిగిన మోడి పెళ్లి చేసుకోలేదు.భారత దేశంలో  తీవ్రవాదం అంతానికి మోడి తరహా విధానం మేలని చాలమంది అభిప్రాయం. చాలామంది దీనితో ఏకీభవించరు.


నవీన్ పట్నాయక్ :  ఒరిస్సా ముఖ్యమంత్రి. ఈయన జీవితంలో అధిక భాగం విదేశాల్లోనే గడిచిపోయింది. తండ్రి బిజు పట్నాయక్ మరణాంతరం ఒరిస్సా లో అడుగుపెట్టారు. ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు.



రాహుల్ గాంధీ : ఇంకా పెళ్లి కాలేదు. వయస్సు 39 సం. ఇండియాలో 'మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్'. అదృష్టవంతులు ఎవరైనా(అమ్మాయిలు) తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.'బెస్ట్ ఆఫ్ లక్'.



            ఈ-మెయిల్: msrinivasu275@gmail.com 

1 comment:

  1. sonia gandhi ki against gaa sushma swaraj annadi. uma bhaarati kaadu

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs